close

తాజా వార్తలు

Updated : 15/04/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2 లక్షల కరోనా కేసుల దిశగా భారత్!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 1.5 లక్షలకు పైగా కొత్త కేసులతో మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. తాజాగా రికార్డు స్థాయిలో 1,84,372 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అగ్రదేశం అమెరికా తర్వాత ఈ స్థాయిలో రోజూవారీ కేసులు బయటపడింది మన దేశంలోనే. అమెరికాలో జనవరి 8న 3.09 లక్షల మందికి కరోనా సోకింది. ఇదే ఇప్పటి వరకూ అత్యధికం. ఇప్పుడు భారత్ కూడా రెండు లక్షల మార్కు దిశగా పయనిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే దాదాపు 178 రోజుల తర్వాత రోజుకి వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.

2020 సెప్టెంబర్ 16న భారత్‌లో అత్యధికంగా 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత రోజూవారీ కేసులు 10వేల దిగువకు చేరాయి. మరోవైపు టీకాల పంపిణీ ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ప్రజల్లో కరోనాపై నిర్లక్ష్య వైఖరి పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే రెండో దశ తీవ్రంగా ఉంటుందని అప్పట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. మరోవైపు దేశంలోకి ప్రవేశించిన వైరస్‌లోని కొత్త రూపాలు తాజా ఉద్ధృతికి కారణమయ్యాయి. ఈ కారణాలతో భారత్‌లో కరోనా విజృంభణ తీవ్రమై, ఏప్రిల్ 4న కొత్త కేసులు మొదటిసారి లక్ష మార్కును దాటేశాయి. ఏప్రిల్ 5 మినహా అప్పటి నుంచి నిత్యం లక్షకు పైగా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అమెరికా తర్వాత లక్షకు పైగా కేసులు నమోదైన దేశంగా భారత్‌ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం మనదేశం పాజిటివ్ కేసుల పరంగా రెండో స్థానంలో, క్రియాశీల కేసుల పరంగా మూడో స్థానంలో ఉందని వరల్డో మీటర్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉద్ధృతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అందరూ టీకా వేయించుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. 

ఛత్తీస్‌గఢ్‌లో పడిపోయిన రికవరీ రేటు

ఇక రోజూవారీ కేసుల్లో మహారాష్ట్రదే ప్రధాన వాటా. గడిచిన 24 గంటల్లో అక్కడ 60,212 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌లో 17,963, ఛత్తీస్‌గఢ్‌లో 15వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతేకాక  12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 90 శాతం దిగువకు పడిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మరీ దారుణంగా 75.8 శాతానికి దిగజారింది. ఇది దేశవ్యాప్తంగా 89.51 శాతంగా కొనసాగుతోంది. రికవరీ రేటులో తగ్గుదల, క్రియాశీల కేసుల్లో పెరుగుదల, భారీగా నమోదవుతోన్న మరణాలతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షల వైపు మొగ్గుచూపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని