Delta Variant: యూకేని చూసి నేర్చుకోవచ్చు..!
close

తాజా వార్తలు

Published : 21/06/2021 01:14 IST

Delta Variant: యూకేని చూసి నేర్చుకోవచ్చు..!

 ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (B.1.617.2) మరో సారి రూపంతరం చెందడంతో k417N మార్పు చోటు చేసుకొందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఇది ఆందోళనకర వేరియంట్‌ అయ్యే ప్రమాదం ఉందన్నారు. డెల్టావేరియంట్‌ కారణంగా యూకేలో కేసులు పెరగటాన్ని చూసి భారత్‌ నేర్చుకోవాలన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. దేశలో అన్‌లాక్‌ చేసిన ప్రదేశాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదలను ఎప్పటికప్పుడు కనిపెట్టి చూసుకోవాలన్నారు. ‘‘డెల్టా వేరియంట్‌లో చిన్న చిన్నమార్పులతో డెల్టాప్లస్‌ వేరియంట్‌ తయారైంది. దీనిలో k417N అనే మ్యూటేషన్‌ చోటు చేసుకొంది. దీంతో ఇది వేగంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. దీనిని ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొంది. ఇప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెల్టాప్లస్‌ విజృంభిస్తే ఆందోళనకర వేరియంట్‌గా మారుతుంది. రానున్న వారాల్లో జాగ్రత్తగా పరిశీలించాలి’’ అని గులేరియా ఒక ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మనం ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని డాక్టర్‌ గులేరియా హెచ్చరించారు. వైరస్‌ ఎక్కువ మందికి  సోకేందుకు మార్పులు చేసుకొంటూనే ఉంటుందన్నారు. ఆ సమయంలో మనం వైరస్‌ కంటే వేగంగా స్పందించాలని తెలిపారు. యూకే ఈ విషయంలో చాలా దూకుడుగా స్పందించి.. కొన్ని నెలల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించినట్లు వివరించారు. అక్కడ డెల్టా వేరియంట్‌ వల్ల కేసులు పెరిగాయి అంటే.. మనకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లే అని గులేరియా అభిప్రాయపడ్డారు.  మళ్లీ మనం అలాంటి స్థితిలోనే ఉన్నాం.. ఇక్కడి నుంచి మూడు లేదా నాలుగు నెలలు  జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 

జన్యుక్రమ విశ్లేషణ వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. అప్పుడే టీకాలు, యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయో ఒక అంచనాకు రావచ్చని తెలిపారు.  

k417N రోగ నిరోధక శక్తిని తప్పించుకొంటుంది..

వాస్తవానికి B.1.617.2 వేరియంట్‌ చాలా తేలిగ్గా సోకుతుంది. అంటే ఈ రకంలో స్పైక్‌ప్రొటీన్‌ వేగంగా మనుషుల శరీరంలోకి వెళుతుంది. ఇక k417N మ్యూటేషన్‌ జరగడంతో అది రోగనిరోధక శక్తికి దొరక్కుండా తప్పించుకొనే అవకాశాలు ఉంటాయి.  లేకపోతే మందులకు లొంగకపోవడం, టీకాల నుంచి పుట్టే రోగనిరోధక శక్తి సరిపోకపోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని