close

తాజా వార్తలు

Published : 05/05/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona : భారత్‌లో 3.82 లక్షల కొత్త కేసులు

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 3.5 లక్షలకుపైగా కేసులు, 3500కుపైగా మరణాలు నమోదవతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,82,315 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. నిన్న ఒక్క రోజే 3,780 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,06,65,148కి చేరింది.
మంగళవారం 3,780 మరణాలు చోటుచేసుకోగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  2,26,188కి పెరిగింది.

కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే 3,38,439 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య  1,69,51,731కి చేరింది.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 34,87,229కి ఎగబాకింది.

ఇప్పటి వరకూ దేశంలో 16,04,94,188 మందికి టీకా పంపిణీ చేశారు.

దేశంలో నిన్న 15,41,299 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 29,48,52,078కి చేరింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని