Corona: కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు..

తాజా వార్తలు

Updated : 27/06/2021 11:39 IST

Corona: కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు..

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,040 కేసులు నమోదు కాగా.. 1258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

* నిన్న 17,77,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 57,944 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు. ఇక రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది.

* నిన్న ఒక్క రోజే 1,258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,95,751గా ఉంది.

* ఇక ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 5,86,403కి తగ్గి.. ఆ రేటు 1.94 శాతానికి పడిపోయింది.

* మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 64,25,893 టీకాలు డోసులు అందించారు. దీంతో ఇప్పటి వరకూ 32,17,60,077 టీకాలు పంపిణీ చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని