India Corona : కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

తాజా వార్తలు

Published : 08/08/2021 09:43 IST

India Corona : కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 కేసులు వెలుగులోకి రాగా.. 491 మరణాలు సంభవించాయి.

* నిన్న 17,22,221 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది.

* తాజాగా నమోదైన కేసుల కంటే రకవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 43,910 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,10,99,771కి చేరి.. ఆ రేటు 97.39 శాతానికి చేరింది.

* ప్రస్తుతం 4,06,822 క్రియాశీల కేసులు(1.27 శాతం) ఉన్నాయి.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 55,91,657 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 50,68,10,492కి చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని