India Corona : 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

తాజా వార్తలు

Updated : 15/08/2021 10:00 IST

India Corona : 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

97.46 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కేసులు వెలుగు చూడగా.. మరణాల సంఖ్య 500లోపే నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* నిన్న 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

* గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది.

* కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా 37,927 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది. ఇక రికవరీ రేటు 97.46%కి పెరిగింది.

*ప్రస్తుతం దేశంలో 3,85,336(1.20శాతం) క్రియాశీల కేసులు ఉన్నాయి.

* ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 73,50,553 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 54,38,46,290కి చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని