
తాజా వార్తలు
4.60 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు..
దిల్లీ : దేశంలో కొన్ని రోజులుగా 40 వేలకుపైగానే నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. నిన్న 38 వేలుగా నమోదైన కేసుల సంఖ్య ఈ రోజు 31 వేలకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,69,322 పరీక్షలు నిర్వహించగా 31,118 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. కొవిడ్‌తో తాజాగా 482 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,37,621కి చేరింది.
గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 41,985 మంది కోలుకోగా.. మొత్తం డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 88,89,585కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,35,603గా ఉంది.ఇక రికవరీ రేటు 93.94 శాతానికి చేరగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 4.60 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు