కరోనా: 99.97 లక్షల మంది కోలుకున్నారు

తాజా వార్తలు

Published : 06/01/2021 10:23 IST

కరోనా: 99.97 లక్షల మంది కోలుకున్నారు

24 గంటల్లో 18,088 కొత్త కేసులు..264 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. అలాగే క్రియాశీల కేసుల్లో తగ్గుదల కొనసాగుతుండగా.. రికవరీ కేసులు దాదాపు కోటికి చేరుకోవడం ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం మంగళవారం 9,31,408 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,088 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో ఇప్పటి వరకు దేశంలో 1,03,74,932 మంది కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల కనిపించడం గమనార్హం. 

కరోనావైరస్ కేసులు తగ్గుతుండటంతో..క్రియాశీల కేసుల్లో కూడా క్షీణత కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 2,27,546 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.19 శాతంగా ఉంది. అలాగే నిన్న ఒక్కరోజే 21,314 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రివకరీల సంఖ్య 99.97లక్షలుగా ఉంది. ఆ రేటు 96.36శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 264 మరణాలు సంభవించాయి. దాంతో మృతుల సంఖ్య 1.5లక్షల మార్కును దాటేసింది. అమెరికా, బ్రెజిల్ తరవాత మరణాల సంఖ్య పరంగా భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు అమెరికాలో 3,65,620, బ్రెజిల్‌లో 1,97,777 మంది కొవిడ్‌తో మృత్యు ఒడికి చేరుకున్నారు. 

ఇవీ చదవండి:

7 రోజుల్లోనే కొవిడ్‌ టీకా

గాలిలో వైరస్ వ్యాప్తి సాధ్యమే


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని