19,299 రికవరీలు.. 18,645 కేసులు

తాజా వార్తలు

Published : 10/01/2021 10:39 IST

19,299 రికవరీలు.. 18,645 కేసులు

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో 8,43,307 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,645 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,50,284కి చేరింది. ఇక కొత్తగా 19,299 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,00,75,950కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.42 శాతానికి పెరిగింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 201 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,50,999కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,23,335కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ.. తొలినాళ్లతో పోలిస్తే రోజురోజుకీ కేసుల సంఖ్య తగ్గుతుండడం ఊరటనిస్తోంది. మరోవైపు బ్రిటన్‌ రకం కరోనా కేసులు శనివారం నాటికి 90కి చేరాయి.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్‌ సన్నద్ధతలపై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయిలో నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రాబోతున్న పండుగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించాలని దీనిలో ఖరారు చేశారు.

ఇవీ చదవండి..

16 నుంచి టీకా

తొలిరోజు 139 కేంద్రాల్లో  టీకా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని