close

తాజా వార్తలు

Updated : 17/01/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

17,170 రికవరీలు.. 15,144 కేసులు

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో 7,79,377 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,144 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,57,985కి చేరింది. ఇక కొత్తగా 17,170 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 1,01,96,885కు చేరింది. దీంతో రికవరీ రేటు 96.58 శాతానికి పెరిగింది.

మరోవైపు, గడిచిన 24 గంటల్లో 181 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,52,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,08,826కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,352 కేంద్రాల్లో 1,91,181 మందికి టీకా ఇచ్చారు. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

‘కొవిన్‌’.. ఆరోగ్య సమాచార గని

మహమ్మారిపై మన బాణం



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని