
తాజా వార్తలు
రికవరీలు, కొత్త కేసులు..13 వేలపైనే
24 గంటల్లో 131 కరోనా మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత 24 గంటల్లో 5,70,246 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,203 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న 131 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 1,53,470 మంది ఈ మహమ్మారికి బలైనట్లు తెలిపింది.
నిన్న ఒక్కరోజే 13,298 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 1,03,30,084 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 96.83 శాతానికి చేరగా.. క్రియాశీల కేసుల రేటు 1.73 శాతానికి తగ్గింది. దేశంలో క్రియాశీల కేసులు 1,84,182గా ఉన్నాయి.
మరోవైపు కరోనా కట్టడికి దేశంలో టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆదివారం నాటికి 16,15,504 మందికి టీకాలు పంపిణీ చేసింది. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలివిడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు.
ఇవీ చదవండి:
చిన్నారుల కళ్లకు శానిటైజర్ల ముప్పు!