97 శాతానికి చేరిన రికవరీ రేటు

తాజా వార్తలు

Updated : 31/01/2021 15:17 IST

97 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో  7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,052 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కి చేరింది. కొత్తగా 13,965 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,04,23,125కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.99 శాతానికి పెరిగింది. 

ఇక గడిచిన 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,54,274కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,68,784కు తగ్గింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 37,44,334కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందుతున్న విషయం తెలిసిందే. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగం కింద ప్రజలకు అందిస్తున్నారు.

ఇవీ చదవండి..

రోగి జన్యు నిర్మాణాన్ని బట్టి ఔషధం

ఆదుకుంటున్న మునుపటి కరోనా ఇన్‌ఫెక్షన్లుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని