17,824 రికవరీలు..12,899 కొత్తకేసులు

తాజా వార్తలు

Published : 04/02/2021 10:35 IST

17,824 రికవరీలు..12,899 కొత్తకేసులు

1.44 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం 12,899 కొత్త వైరస్ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసులు సంఖ్య 1,07,90,183కి చేరింది. గడిచిన 24 గంటల్లో 107 మంది మృత్యు ఒడికి చేరుకోగా.. దేశంలో వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి 1,54,703 మరణాలు సంభవించాయి. 

ఇక, క్రియాశీల రేటు 1.44 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.13 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,55,025కు పడిపోయింది. అలాగే నిన్న ఒక్కరోజే అత్యధికంగా 17,824 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.04 కోట్ల మందికిపైగా వైరస్‌ నుంచి బయటపడ్డారు. నిన్న 7,42,841 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ టీకా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న 3,10,604 మంది టీకా వేయించుకున్నారని కేంద్రం వెల్లడించింది. నిన్నటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 44,49,552కి చేరిందని తెలిపింది.

ఇవీ చదవండి:

భారత్‌లో 30 కోట్ల మందికి కరోనా

సౌదీకి అంతర్జాతీయ విమానాలు నిలిపివేత


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని