క్రియాశీల రేటు..1.40 శాతం

తాజా వార్తలు

Published : 05/02/2021 10:32 IST

క్రియాశీల రేటు..1.40 శాతం

20కోట్లకు సమీపించిన కొవిడ్‌ పరీక్షలు

24 గంటల్లో 12,408 కొత్త కేసులు..120 మరణాలు

దిల్లీ: దేశంలో క్రియాశీల కొండ తరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ క్రియాశీల కేసులు 1,51,460కి తగ్గగా..ఆ రేటు 1.40 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం 7,15,776 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..12,408 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591కి చేరింది. అలాగే నిర్ధారణ పరీక్షల సంఖ్య 20 కోట్లకు సమీపించింది. నిన్నటి వరకు 19.99 కోట్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. 

ఇప్పటివరకు 1.04కోట్ల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15,853 మంది దాన్నుంచి బయటపడగా..ఆ రేటు 97.16 శాతానికి చేరుకుంది. ఈ మహమ్మారికి తాజాగా 120 మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య 1,54,823కి చేరుకుంది. మరోవైపు, ఫిబ్రవరి 4 నాటికి 49,59,554 మంది కరోనా టీకా తీసుకున్నారు. నిన్న 5,09,893 మంది ఈ టీకా తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఇవీ చదవండి:

సీరం, యూనిసెఫ్ వ్యాక్సిన్ ఒప్పందం

బెదిరించినా..రైతులతోనే: గ్రేటా థన్‌బర్గ్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని