క్రియాశీల రేటు..1.30 శాతం

తాజా వార్తలు

Published : 10/02/2021 10:23 IST

క్రియాశీల రేటు..1.30 శాతం

24 గంటల్లో 11,067 కొత్త కేసులు..94 మరణాలు

దిల్లీ: గడిచిన 24 గంటల్లో 7,36,903 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 11,067 కరోనా కేసులు వెలుగుచూశాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చగా.. కొత్త కేసుల్లో 21 శాతం పెరుగుదల కనిపిచింది. అలాగే 94 మంది ఈ వైరస్ కారణంగా మృత్యుఒడికి చేరుకున్నట్లు తెలిపింది. కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.08 కోట్లకు చేరుకోగా..ఇప్పటివరకు 1,55,252 మరణాలు సంభవించాయి.

తాజాగా 13,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,05,61,608గా ఉండగా.. ఆ రేటు 97.27 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,41,511 క్రియాశీల కేసులున్నాయి. ఆ రేటు 1.30శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 20,33,24,655 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

మరోవైపు, ఫిబ్రవరి 9 నాటికి కేంద్రం 66,11,561 మంది వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు పంపిణీ చేసింది. నిన్న టీకా తీసుకున్నవారి సంఖ్య 3,52,553గా ఉంది. కరోనా కట్టడికి భారత ప్రభుత్వం జనవరి 16 నుంచి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

కరోనా వైరస్ జీవాయుధం కాకపోవచ్చు

ఆక్స్‌ఫర్డ్ టీకా సమర్థవంతమైనదే:WHO


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని