మరోసారి పదివేల దిగువకు కేసులు..
close

తాజా వార్తలు

Published : 12/02/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి పదివేల దిగువకు కేసులు..

1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

9,309 కొత్త కేసులు..87 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి పదివేల దిగువకు పడిపోయాయి. గురువారం 7,65,944 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..9,309 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో భారీ తగ్గుదలే కనిపించింది. అలాగే ఈ నెలలో మరోసారి 100లోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 87 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 1,08,80,603 మంది ఈ మహమ్మారి బారిన పడగా..1,55,447 మరణాలు సంభవించాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

అలాగే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం 1,35,926 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.25 శాతానికి చేరింది. రికవరీ రేటు 97.32 శాతానికి పెరిగింది. కోలుకున్నవారు 1.05కోట్లకు పైబడ్డారు.

మరోవైపు, జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 75,05,010 మంది టీకా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే 4,87,896 మంది టీకా తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇవీ చదవండి:

యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాలు గుర్తింపు..!

‘సూపర్ స్ప్రెడర్’లు వీరే 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని