రెండో రోజు..16వేలపైనే కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 26/02/2021 11:46 IST

రెండో రోజు..16వేలపైనే కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోసారి కలవరానికి గురిచేస్తోంది. వరసగా రెండో రోజు కొత్త కేసులు 16 వేలకు పైగా నమోదయ్యాయి. కొద్ది రోజులుగా 100కి పైగానే మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,31,807 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16,577 కొత్త కేసులు బయటపడ్డాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా 120 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,56,825కి చేరింది. 

ఇక, కొవిడ్‌ కేసుల విజృంభణతో..క్రియాశీల రేటులో పెరుగుదల, రికవరీ రేటులో తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులతో పోల్చితే రికవరీలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 12,179 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటివరకు వైరస్ నుంచి బయటపడినవారి సంఖ్య 1.07కోట్లకు పైబడింది. 1,55,986 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.41 శాతానికి చేరింది. 

మరోవైపు, కరోనా వైరస్ టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 25 నాటికి 1,34,72,643 మందికి కేంద్రం టీకా పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 8,01,480 మంది టీకా వేయించుకున్నారని తెలిపింది. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని