కరోనా కలవరపెడుతోంది

తాజా వార్తలు

Updated : 27/02/2021 11:57 IST

కరోనా కలవరపెడుతోంది

16,488 కొత్త కేసులు..113 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులుగా 16 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో 16,488 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979కి చేరింది. ఇక, మరణాల సంఖ్య వందకు పైనే ఉంది. తాజాగా 113 మంది మృత్యుఒడికి చేరుకోగా..మొత్తంగా 1,56,939 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. 

కరోనా బారిన పడేవారి సంఖ్య పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,59,590 మంది వైరస్‌తో బాధపడుతుండగా..ఆ రేటు 1.44 శాతానికి చేరింది. నిన్న 12,771 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీలు 1.07కోట్లకు పైబడగా..ఆ రేటు 97.14శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,73,918 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు, జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఫిబ్రవరి 26 నాటికి 1,42,42,547 టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్కరోజే 7,69,904 మంది టీకా తీసుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని