close

తాజా వార్తలు

Published : 02/03/2021 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాస్త తెరిపినిచ్చిన కరోనా..

12,286 కొత్త కేసులు..ముందు రోజుకంటే 20శాతం తగ్గుదల 

దిల్లీ: దేశంలో రోజూవారీ కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. సోమవారం 7,59,283 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా.. 12,286 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే 20 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు 1.11కోట్ల మందికి పైగా వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా మరణాల సంఖ్య 100 దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 91 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,248కి చేరింది. 

గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుకావడంతో..వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,68,358 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.51 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 12,464 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,07,98,921 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఆ రేటు 97.07 శాతంగా ఉంది. 

మరోవైపు కరోనా టీకా కార్యక్రమంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఇంతకాలం పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు ఇస్తుండగా.. నిన్నటి నుంచి 60 ఏళ్లు పైడిన, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు టీకాలు అందిస్తోంది. టీకాపై ఉన్న అపోహలు తొలగించేందుకు నిన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకా తొలి డోసును స్వీకరించారు. అలాగే అర్హులు టీకా కోసం తమ పేరును నమోదుచేసుకునేందుకు కేంద్రం కొవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దానిలో 25లక్షల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. కాగా మార్చి ఒకటి నాటికి 1,48,54,136 కోట్లమందికి టీకా వేసినట్లు తెలిపింది. నిన్న 5,52,639 మంది టీకా వేయించుకున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని