close

తాజా వార్తలు

Updated : 06/03/2021 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ కలవరపెడుతున్న కరోనా 

18,327 కొత్త కేసులు..వంద దాటిన మరణాలు

దిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల కంగారు పుట్టిస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి.. మళ్లీ కొన్నివారాలుగా విజృంభిస్తోంది. 20వేలకు చేరువగా పాటిజివ్ కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 7,51,935 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,327 కొత్త కేసులు వెలుగుచూశాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో రోజు కూడా మరణాల సంఖ్య వంద దాటింది. తాజాగా 108 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 1.11 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,57,656 మరణాలు సంభవించాయి.

కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు ఎగబాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్షా 80వేలకు పైబడ్డాయి. ఆ రేటు 1.61 శాతానికి పెరిగింది. ఈ మధ్యకాలంలో 97 శాతాన్ని దాటిన రికవరీ రేటు.. ఇప్పుడు 96.98 శాతానికి పడిపోవడం గమనార్హం. నిన్న 14,234 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 1,08,54,128కి చేరింది. కొవిడ్ టీకాల రాక, కేసులు తగ్గుదల కారణంగా ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యం, ప్రభుత్వం దాదాపుగా అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం.. తాజా విజృంభణకు కారణమని నిపుణులు అంటున్నారు. 

మరోవైపు, దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు చేరువవుతోంది. రెండు దశల్లో భాగంగా మార్చి ఐదు నాటికి.. 1,94,97,704 మందికి కేంద్రం టీకాలు అందించింది. నిన్న అత్యధికంగా 14,92,201 మంది టీకాలు వేయించుకున్నారు. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని