మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి

తాజా వార్తలు

Updated : 11/03/2021 11:42 IST

మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి

22,854 కొత్త కేసులు..126 మరణాలు

మహారాష్ట్రదే అగ్రభాగం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రతాపం చూపిస్తోంది. కరోనా కేసుల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది.  బుధవారం 7,78,416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు సంఖ్య 1,12,85,561కి చేరగా.. 1,58,189 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో క్రియాశీల కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం 1,89,226 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.68 శాతానికి చేరింది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. తాజాగా 18,100 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది. 

కలవరపెట్టిస్తోన్న మహారాష్ట్ర:

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కలవరం పుట్టిస్తోంది. నిత్యం సుమారు 10వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ, నిన్న మాత్రం అత్యధికంగా 13,659 కొత్త కేసులు వెలుగుచూశాయి. 54 మరణాలు సంభవించాయి. లక్షకు పైగా క్రియాశీల కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి.  దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే  రాష్ట్రం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సజావుగా టీకా కార్యక్రమం..
దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాంటకంగా కొనసాగుతోంది. రెండు దశలు కలుపుకొని మార్చి 10 నాటికి కేంద్రం 2,56,85,011 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 13,17,357 మంది టీకా వేయించుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని