కరోనా.. కాస్త తగ్గిన కొత్తకేసులు

తాజా వార్తలు

Updated : 16/03/2021 10:33 IST

కరోనా.. కాస్త తగ్గిన కొత్తకేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 26 వేలకుపైగా కేసులు నమోదుకాగా.. నిన్న 24,492 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.  గడిచిన 24 గంటల్లో 8.73లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. కొత్తగా 20,191 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,27,543కు చేరి.. రికవరీ రేటు 96.65గా నమోదైంది.

ఇక మరణాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,58,856కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,23,432కి పెరిగింది.

ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 3,29,47,432కి చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని