40వేలకు చేరువగా కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 19/03/2021 11:46 IST

40వేలకు చేరువగా కరోనా కేసులు

క్రితంరోజు కంటే 11% పెరుగుదల

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసులు సంఖ్య 40వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 10,57,383 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..39,726 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చితే 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.15 కోట్లకు పైబడగా.. 1,59,370 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో.. క్రియాశీల కేసులు కూడా పైపైకి ఎగబాగుతున్నాయి. ప్రస్తుతం 2,71,282(2.20శాతం) మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్నటివరకు 1.10కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 20,654 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఆ రేటు 96.41 శాతానికి చేరింది. అయితే రికవరీల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

‘మహా’ విజృంభణ:
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేల పైనే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,853 మందికి వైరస్ సోకగా..మొత్తం కేసుల సంఖ్య 23లక్షలు దాటింది. 58 మంది మృత్యు ఒడికి చేరుకోగా..మొత్తంగా 53,138 మంది ప్రాణాలు వదిలారు. ఆ రాష్ట్రంలో ఇదే స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగితే..ఏప్రిల్ నాటికి క్రియాశీల కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1.67లక్షలుగా ఉంది.

ఇక, కరోనా టీకాల విషయానికి వస్తే..ఇప్పటివరకు 3,93,39,817 మందికి టీకాలు అందాయి. నిన్న ఒక్కరోజే 22,02,861 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని