కరోనా ఉద్ధృతి: 97వేల కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 06/04/2021 13:17 IST

కరోనా ఉద్ధృతి: 97వేల కొత్త కేసులు

446 మంది మృత్యుఒడికి..

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం 96,982 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది సెప్టెంబర్ నాటి కొవిడ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసుల్లో భారీ పెరుగుదల కారణంగా..కొవిడ్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్నటికి 7,88,223 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 5.89 శాతానికి చేరింది.

నిన్న ఒక్కరోజే 50,143 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోటీ 17 లక్షల పైచిలుకు మంది ఈ మహమ్మారిని జయించగా..రికవరీ రేటు 92.80 శాతానికి పడిపోయింది. కొత్తగా 446 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.

మహారాష్ట్రలో ఆగని కరోనా ఉద్ధృతి..
మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో 47,288 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా..155 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసులు 30,57,885 కి చేరగా..25,49,075 మంది కోలుకున్నారు. 4,52,777 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. 

8కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ..
దేశవ్యాప్తంగా మూడు దశల్లో భాగంగా నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద ఏప్రిల్ ఐదు నాటికి 8,31,10,926 మందికి కరోనా టీకా అందింది. నిన్న 43,00,966 మందికి కేంద్రం టీకా పంపిణీ చేసింది. కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో..టీకా కార్యక్రమ పరిధిని విస్తృతం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థిస్తున్నాయి. 

25 కోట్లు దాటిన కొవిడ్ పరీక్షలు:

దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు 25కోట్ల మార్కును దాటినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న 12,11,612 మంది నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని