close

తాజా వార్తలు

Updated : 07/04/2021 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైరస్‌ భారీ విజృంభణ..1,15,736 కొత్త కేసులు

కొవిడ్‌ బారిన పడి 630 మంది బలి

8లక్షలకు పైగా క్రియాశీల కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 12,08,329 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,15,736 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా రోజూవారీ కేసులు లక్ష మార్కు(1,03,558)ను దాటాయి. తాజాగా మరోసారి అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. నిన్న మరణాల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. 630 మంది మృత్యుఒడికి చేరుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,66,177 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో..క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,43,473(6.21శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక, కొవిడ్‌బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంటుంది. నిన్నఒక్కరోజే 59,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,17,92,135 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.48 శాతానికి పడిపోయింది.

ఇక మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 55 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో ఈ రాష్ట్రం నుంచే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని