ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా

తాజా వార్తలు

Updated : 10/04/2021 11:03 IST

ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా

794 మరణాలు.. 10లక్షలు దాటిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా లేదు. కొద్దివారాలుగా ఎన్నడూ లేనంత వేగంగా మహమ్మారి విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,45,384 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఇక క్రియాశీల కేసులు భారీగా పెరిగాయి. నిన్నటికి 10,46,631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది. అయితే, నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకోవడం సానుకూల పరిణామం. ప్రస్తుతం వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరువైంది. 

మహారాష్ట్రలో ఆగని వైరస్ ఉద్ధృతి..
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 58,993 మందికి వైరస్ సోకగా..301 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 32లక్షలకు పైబడగా..57వేల మందికిపైగా ప్రాణాలు వదిలారు. సుమారు 27లక్షల మంది కోలుకున్నారు. వైరస్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 5,36,063 మందికి చేరింది. సగానికిపైగా క్రియాశీల కేసులు ఈ ఒక్కరాష్ట్రంలోనే నెలకొని ఉండటం తీవ్రతను వెల్లడిచేస్తోంది. మరోవైపు, దేశవ్యాప్తంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద నిన్నటివరకు 9,80,75,160 మందికి టీకా డోసులు అందాయి. నిన్న ఒక్కరోజే 34,15,055 మందికి టీకా వేయించుకున్నారు. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని