close

తాజా వార్తలు

Updated : 12/04/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా:భారీగా పెరిగిన మృతుల సంఖ్య

1,68,912 కొత్త కేసులు..904 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇంతకాలం మహారాష్ట్రనే పీడించిన మహమ్మారి.. చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 904 మంది మృత్యుఒడికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. నిన్న 11,80,136 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,68,912 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య కోటీ 35లక్షలకు చేరగా..లక్షా 70వేలకు పైగా మరణాలు సంభవించాయి. 

కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటంతో..బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 12,01,009కి చేరాయి. పాజిటివ్ కేసుల్లో ఆ వాటా 8.29 శాతానికి చేరింది. ఇక, నిన్న 75,086 మంది కోలుకున్నారు. మొత్తంగా కోటీ 20లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించగా.. ఆ రేటు 90.44 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 29,33,418 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో ఇప్పటివరకు టీకా డోసులు తీసుకున్నవారికి సంఖ్య 10,45,28,565కి చేరింది.

రాష్ట్రాల్లో రికార్డు కేసులు..

కరోనావైరస్‌ రెండో దశకు మహారాష్ట్ర కేంద్రబిందువుగా మారింది. తాజాగా రికార్డు స్థాయిలో 63,294 మందికి వైరస్ సోకింది. 349 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 5,67,097 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడగా..27లక్షల మందికి పైగా కోలుకున్నారు. గతంలో ఎన్నడూ లేని తీవ్రత కనిపిస్తుండటంతో ఆ రాష్ట్రం ఆంక్షలను తీవ్రతరం చేసింది. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్ విధింపుపై వస్తోన్న వార్తలపై ఏప్రిల్ 14న ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది. మరోవైపు, దేశ రాజధాని దిల్లీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ అత్యధికంగా 10,774 కొత్త కేసులు వెలుగుచూశాయి. 48 మంది మరణించారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ విధించేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పిన ఆయన.. ఒకవేళ ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలితే లాక్‌డౌన్ తప్పదని వివరించారు. గత దశలకంటే నాలుగో దశలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని