భారత్‌లో కరోనా : ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలు

తాజా వార్తలు

Updated : 14/04/2021 10:33 IST

భారత్‌లో కరోనా : ఒక్కరోజే వెయ్యికిపైగా మరణాలు

1,84,372 పాజిటివ్ కేసులు..13లక్షలు దాటిన క్రియాశీల కేసులు 

దిల్లీ: రెండో దశలో కరోనా వైరస్ రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతోంది. తాజాగా 1,027 మందిని బలితీసుకుంది. మరణాల సంఖ్య వెయ్యి దాటడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. నిన్న 14,11,758 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,84,372 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు కోటీ 38 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 1,72,085 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

గడిచిన 24 గంటల్లో క్రియాశీల కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 13,65,704 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 9.24 శాతానికి చేరింది. నిన్నఒక్కరోజే 82,339 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..మొత్తం రికవరీలు 1,23,36,036(89.51 శాతం)కి చేరాయి. ఫిబ్రవరి మధ్యలో రికవరీ రేటు 97 శాతానికి పైబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడది దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 26కోట్ల మార్కును దాటినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్కడ నిన్న ఒక్క రోజే 60 వేలకుపైగా కేసులు.. 281 మరణాలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా నిన్న 26,46,528 మందికి కరోనా టీకాలు అందించారు. దాంతో ఇప్పటివరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 11,11,79,578కి చేరింది. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని