close

తాజా వార్తలు

Published : 23/04/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona: మూడో రోజు 2వేలకు పైనే మరణాలు

కొత్తగా 3,32,730 మందికి కొవిడ్ పాజిటివ్‌

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. మూడు రోజులుగా రెండు వేలమందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వైరస్ సంక్రమణ భారత్‌లో కనిపిస్తుండటం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను కళ్లకుకడుతున్నాయి. 

గడిచిన 24 గంటల్లో 17,40,550 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,32,730 కొత్త కేసుల వెలుగుచూశాయి. 2,263 మంది ప్రాణాలు విడిచారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కి చేరగా..ఇప్పటివరకు 1,86,920 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్న తరుణంలో.. వైరస్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 24,28,616 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 14.38 శాతానికి పెరిగింది. అయితే నిన్న సుమారు రెండు లక్షల మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకోవడం కాస్త సానుకూల పరిణామం. నిన్న ఒక్కరోజే 1,93,279 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 36లక్షలకు పైబడింది. రికవరీ రేటు మాత్రం 84.46 శాతానికి పడిపోయింది. మరోవైపు, నిన్న 31,47,782 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. ఇప్పటివరకు మొత్తం 13.54 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందాయి. 

కొవిడ్‌ గుప్పిట్లో రాష్ట్రాలు..

⇒ మహారాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. తాజాగా అక్కడ 67,013 మందికి కరోనా సోకగా..568 మంది మరణించారు. 

⇒ దేశరాజధాని దిల్లీలో కరోనా ప్రతాపం చూపిస్తోంది. అక్కడ మరణాలు 306కి చేరుకున్నాయి. తాజాగా 26,169 మందికి వైరస్ సోకింది. 

⇒ ఉత్తర్‌ప్రదేశ్‌(34,254), కేరళ(26,995), కర్ణాటక(25,795) రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత ఎక్కువగానే ఉంది. చత్తీస్‌గఢ్‌లో 207 మంది ప్రాణాలు వదిలారు. 


 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని