corona: భారత్‌ను వణికిస్తోన్న మహమ్మారి

తాజా వార్తలు

Published : 26/04/2021 09:59 IST

corona: భారత్‌ను వణికిస్తోన్న మహమ్మారి

3.52లక్షల కేసులు..2,812 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 2,812 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఆదివారం 14,02,367 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,52,991 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరగా.. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.

ఇక, మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 15.82 శాతానికి పెరిగింది. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. ఈ లెక్కలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు, నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోయింది. ఇదిలా ఉండగా.. నిన్న 9,95,288 మంది కరోనా టీకా వేయించుకున్నారు. మొత్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 14,19,11,223కి చేరింది. 

మహారాష్ట్రలో మరణ మృదంగం..దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం మరణాల్లో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. తాజాగా అక్కడ 832 మంది మరణించగా..66వేల పైచిలుకు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏడు లక్షలమందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు. దిల్లీలో 22,933 కొత్త కేసులు వెలుగుచూడగా..350 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో వైరస్ భారీగా విజృంభిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని