corona: నాలుగువేల దిగువకు మరణాలు

తాజా వార్తలు

Updated : 20/05/2021 10:10 IST

corona: నాలుగువేల దిగువకు మరణాలు

2,76,110 కొత్త కేసులు..3,874 మరణాలు

31లక్షలకు చేరిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అయితే గత నాలుగు రోజులుగా భారీగా నమోదైన మరణాలు..నిన్న కొద్దిమేర తగ్గాయి. కొన్నిరోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు..వరసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. 

బుధవారం 20,55,010 కొవిడ్ నమూనాలను పరీక్షించగా..2,76,110 కొత్త కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 3,874 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రితంరోజు రికార్డు స్థాయికి చేరిన మరణాలు (4,529).. నిన్న 4వేల దిగువన నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2.57కోట్లకు పైబడింది. ఇప్పటి వరకు 2,87,122 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కరోనా రోజూవారీ కేసులు కాస్త అదుపులో ఉండటంతో..క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 31,29,878 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 12.66 శాతానికి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 3.69లక్షల మంది వైరస్ నుంచి కోలుకొన్నారు. ప్రస్తుతం 2.23 కోట్ల మందికిపైగా కోలుకోవటంతో రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. మరోవైపు, దేశవ్యాప్తంగా నడుస్తోన్న టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడం లేదు. నిన్న 11,66,090 మందికి మాత్రమే టీకాలు అందాయి. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 18,70,09,792కి చేరింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని