Corona: మరింత తగ్గిన కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 24/05/2021 10:17 IST

Corona: మరింత తగ్గిన కొత్త కేసులు

భారీగా నమోదైన మరణాలు

10 శాతానికి చేరిన క్రియాశీల రేటు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కాస్త అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, వైరస్‌ కట్టడి ఆంక్షలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొవిడ్ మృతుల సంఖ్య మాత్రం ఆందోళనకరంగానే ఉంటోంది. భారీగా మరణాలు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది.

ఆదివారం 19,28,127 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజుతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో మరోసారి భారీగా మరణాలు సంభవించాయి. నిన్న 4,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 2,67,52,447 మందికి కరోనా సోకగా..3,03,720 మంది ప్రాణాలు కోల్పోయారు.

క్రియాశీల కేసులు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. తాజాగా 27,20,716 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 3,02,544 మంది కోలుకోగా..మొత్తం రికవరీలు 2.37కోట్లకు పైబడ్డాయి. రికవరీరేటు 88.69 శాతానికి చేరింది. మరోవైపు నిన్న 9,42,722 మందికి టీకాలు అందాయి. మొత్తంగా 19.60కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. 

తమిళనాడులో అత్యధిక కేసులు..
నిన్నటి కొత్త కేసుల్లో అత్యధికంగా తమిళనాడులోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో 35,483 మందికి కరోనా సోకింది. అలాగే 422 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న సంభవించిన మరణాల్లో మహారాష్ట్ర వాటానే ఎక్కువ. ఆ రాష్ట్రంలో రికార్డైన మరణాల సంఖ్య 1,320గా ఉంది. ఆ తరవాతి స్థానంలో కర్ణాటక(624) ఉంది. కర్ణాటక, కేరళలో 25 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ..మరణాలు పరంగా రెండు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నిన్న కేరళలో 188 మంది ప్రాణాలు వదిలారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని