Corona:44 రోజుల కనిష్ఠానికి రోజూవారీ కేసులు

తాజా వార్తలు

Updated : 28/05/2021 11:06 IST

Corona:44 రోజుల కనిష్ఠానికి రోజూవారీ కేసులు

కొత్తగా 1.86 లక్షల కేసులు..3,660 మరణాలు

90శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా రెండులక్షల లోపు కొత్తకేసులు వెలుగుచూశాయి. 44 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు కనిష్ఠానికి చేరుకున్నాయి. రెండోరోజు మరణాలు నాలుగువేల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల కేసులు తగ్గుతూ, రికవరీ రేటు మెరుగుపడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. 

గురువారం 20,70,508మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,86,364మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. సుమారు 44 రోజుల తరవాత మొదటిసారి రోజూవారీ కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 13న 1,84,372 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2.75కోట్లకుపైబడింది. 

 24గంటల వ్యవధిలో 3,660మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు 3,18,895మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరణాలరేటు 1.15 శాతంగా కొనసాగుతోంది. 

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23,43,152మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 8.84 శాతానికి చేరింది. కొత్తకేసులు అదుపులోకి వస్తుండటంతో ఈ తగ్గుదల కనిపిస్తోంది. 

 రోజురోజుకూ రికవరీలసంఖ్య మెరుగ్గా ఉంటోంది. నిన్న ఒక్కరోజే 2,59,459మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీరేటు 90.01 శాతానికి చేరుకుంది. మొత్తంగా 2.48కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. వరసగా 15వరోజు కొత్తకేసుల కంటే రికవరీలే ఎక్కువ. 

 ఇక, నిన్న 29,19,699మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన టీకాల సంఖ్య 20,57,20,660కి చేరింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని