corona:4వరోజు..2లక్షలలోపే కేసులు

తాజా వార్తలు

Published : 31/05/2021 09:56 IST

corona:4వరోజు..2లక్షలలోపే కేసులు

50 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

3,128 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరసగా నాలుగు రోజులుగా రోజూవారీ కేసులు రెండులక్షల దిగువనే నమోదయ్యాయి. రికవరీరేటు ఊరటనిస్తోంది. క్రియాశీలరేటు తగ్గుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.

ఆదివారం 16,88,135మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,52,734మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు 50రోజుల తరవాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే, నిన్న నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గింది. 24గంటల వ్యవధిలో 3,128మంది ప్రాణాలు వదిలారు. వరసగా ఐదోరోజు మృతుల సంఖ్య నాలుగు వేలకు దిగువనే నమోదైంది. ఇప్పటి వరకు 2.8కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా..3,29,100మంది మహమ్మారికి బలయ్యారు. 

ఇక క్రియాశీలరేటు 7.58శాతానికి తగ్గగా.. రికవరీరేటు 91.25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 20,26,092మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 2,38,022 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.56 కోట్లకు పైబడ్డాయి. మరోవైపు నిన్న 10,18,076మంది టీకాలు వేయించున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు అందిన డోసుల సంఖ్య.. 21,31,54,129.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని