Corona: 3 వేల దిగువకు మరణాలు

తాజా వార్తలు

Updated : 01/06/2021 12:03 IST

Corona: 3 వేల దిగువకు మరణాలు

కొత్తగా 1.27లక్షల మందికి పాజిటివ్‌

20లక్షల దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 19,25,374మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,27,510 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల కనిపించింది. వరుసగా ఐదోరోజు కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 2,795 మంది ప్రాణాలు వదిలారు. ఏప్రిల్ చివరి నుంచి మే నెల మొత్తం భారీగా నమోదైన కరోనా మరణాలు..నిన్న మూడు వేల దిగువకు చేరటం ఊరట కలిగిస్తోంది. మొత్తంగా 2,81,75,044మంది వైరస్ బారిన పడగా..3,31,895మంది మహమ్మారికి బలయ్యారు. 

ఇక, క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 18,94,520మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 7.22 శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే 2,55,287మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2.59కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 91.60శాతానికి చేరింది. మరోవైపు, నిన్న 27,80,058మందికి కరోనా టీకాలు అందాయి. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య..21,60,46,638. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని