corona: వైరస్ వ్యాప్తిలో హెచ్చుతగ్గులు

తాజా వార్తలు

Updated : 03/06/2021 10:08 IST

corona: వైరస్ వ్యాప్తిలో హెచ్చుతగ్గులు

1.34లక్షల కేసులు..2,887 మరణాలు

92.48శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: కరోనా కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. మరణాలు మూడువేల దిగువకు చేరాయి. గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు తగ్గుతుండగా..రికవరీలు పెరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.  

 బుధవారం 21,59,873 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,34,154 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. వరసగా రెండోరోజు కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 2.84కోట్లకు పైబడ్డాయి.

 24 గంటల వ్యవధిలో 2,887 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితంరోజు మూడువేలకుపైగా మరణాలు సంభవించగా..తాజాగా వాటిలో తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు మొత్తం 3,37,989 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. 

 ప్రస్తుతం 17,13,413 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 6.34 శాతానికి తగ్గింది. 

  నిన్న ఒక్కరోజే 2,11,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2,63,90,584(92.48శాతం)గా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం.

  నిన్న 24,26,265 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య.. 22,10,43,693.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని