Corona: 6 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు
close

తాజా వార్తలు

Updated : 04/06/2021 11:58 IST

Corona: 6 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

1.32లక్షల కొత్త కేసులు..2,713 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 20,75,428 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,32,364 మందికి పాజిటివ్‌గా తేలింది. 24గంటల వ్యవధిలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు కంటే మరణాల సంఖ్య తక్కుగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకూ 2,85,74,350 మందికి కరోనా సోకగా..3,40,702 మంది బలయ్యారు.

ఇక, క్రియాశీలరేటు 6.02 శాతానికి తగ్గగా..రికవరీరేటు 92.79 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 16,35,993 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 2,07,071 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 2.65కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసుల్లో తగ్గుదల, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశాలు. మరోవైపు నిన్న 28,75,286 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 22,41,09,448కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని