Corona: క్రమంగా తగ్గుతున్న కేసులు

తాజా వార్తలు

Updated : 05/06/2021 11:02 IST

Corona: క్రమంగా తగ్గుతున్న కేసులు

93 శాతానికి చేరిన రికవరీ రేటు

3,380 మంది మృత్యువాత

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. తాజాగా రోజువారీ కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరాయి. అయితే మరణాలు మాత్రం తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. తాజాగా 1.20లక్షల మందికి కరోనా సోకగా..3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.

 శుక్రవారం 20,84,421 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,20,529 మందికి వైరస్ సోకింది. దాంతో మొత్తం కేసులసంఖ్య 2,86,94,879 చేరింది.

 24గంటల వ్యవధిలో 3,380 మంది మహమ్మారికి బలయ్యారు. ముందు రెండు రోజులు మూడువేలకు దిగువనే మరణాలు సంభవించినప్పటికీ..తాజాగా పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు 3,44,082 మంది ప్రాణాలు కోల్పోగా..మరణాలు రేటు 1.19 శాతంగా కొనసాగుతోంది. 

 ప్రస్తుతం దేశంలో 15,55,248 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 5.73 శాతానికి తగ్గింది. 

 నిన్నఒక్కరోజే 1,97,894 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు వైరస్‌ను జయించినవారి సంఖ్య 2,67,95,549 మందికి చేరింది. రికవరీరేటు 93.08 శాతానికి పెరిగింది. 

⇒ జూన్‌ 4న 36,50,050 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య..22,78,60,317. ►



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని