Corona: 1500కి దిగొచ్చిన రోజువారీ మరణాలు..
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 10:55 IST

Corona: 1500కి దిగొచ్చిన రోజువారీ మరణాలు..

స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు

8లక్షల దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు అదుపులోనే ఉంటున్నాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 62,480 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 2.97కోట్లకు చేరాయి.

రెండు నెలల కనిష్ఠానికి..

ఇక రోజువారీ కరోనా మరణాల్లో చాలా రోజుల తర్వాత తగ్గుదల నమోదైంది. రెండు నెలల కనిష్ఠానికి ఇవి చేరాయి. 24 గంటల వ్యవధిలో 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌ 18 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక ఇప్పటివరకు 3,83,490 మంది మహమ్మారికి బలయ్యారు. గురువారం 19,29,476 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇక క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 8లక్షల దిగువకు చేరింది. క్రియాశీల రేటు 2.78 శాతానికి చేరగా.. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. నిన్న 88,977 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.85 కోట్లకు పైబడ్డాయి. అలాగే నిన్న 32,59,003 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 26,89,60,399కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని