Corona: 3కోట్ల కేసులు..2.9కోట్ల రికవరీలు
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 10:33 IST

Corona: 3కోట్ల కేసులు..2.9కోట్ల రికవరీలు

అమెరికా తర్వాత ఆ మార్కు దాటింది మనదగ్గరే

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మూడు కోట్ల మార్కును దాటాయి. గతేడాది జనవరి 30న మనదేశంలో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండుదశల్లో మహమ్మారి విజృంభించింది. ప్రస్తుతం రెండోదఫా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.  

తాజాగా 19,01,056 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 50,848 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 19 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 1,358 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ముందురోజు కంటే మరణాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసులు మూడు కోట్ల మార్కును దాటగా.. 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రదేశం అమెరికా తరవాత ఆ స్థాయిలో కేసులు నమోదైంది ఒక్క మనదేశంలోనే. 

క్రియాశీల కేసులు 6.4లక్షలకు తగ్గగా.. ఆ రేటు 2.21 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96.5 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 68,817 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.9కోట్ల మంది వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. మరోపక్క నిన్న 54,24,374 మందికి టీకా అందింది. ఇప్పటివరకు 29కోట్ల 46లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని