Corona: 100 రోజుల తర్వాత.. 40వేల దిగువకు

తాజా వార్తలు

Updated : 29/06/2021 11:21 IST

Corona: 100 రోజుల తర్వాత.. 40వేల దిగువకు

కొత్తగా 37,566 కేసులు..907 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. సోమవారం 17,68,008 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 37,566 మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు 100 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో క్షీణించాయి. 24 గంటల వ్యవధిలో 907 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. వరుసగా రెండోరోజు వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,16,897కి చేరగా.. 3,97,637 మంది ప్రాణాలు వదిలారు.

ప్రస్తుతం 5.52లక్షల క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.82 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 56,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్ల మార్కును దాటాయి. మరోపక్క సోమవారం 52,76,457 మంది టీకాల వేయించుకున్నారు. ఇప్పటివరకు 32,90,29,510 టీకా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని