Corona: 97 శాతానికి రికవరీ రేటు

తాజా వార్తలు

Updated : 30/06/2021 12:06 IST

Corona: 97 శాతానికి రికవరీ రేటు

కొత్తగా 45,951 కేసులు.. 817 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ.. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 45,951 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 22 శాతం పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల కొనసాగుతోంది. తాజాగా 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక దేశంలో మొత్తం కేసులు 3,03,62,848కి చేరగా..3,98,454 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక క్రియాశీల కేసులు 5,37,064కి చేరాయి. నిన్న 60,729 మంది కోలుకున్నారు. క్రియాశీల రేటు 1.82 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది. మొత్తం రికవరీలు 2.94కోట్లకు చేరాయి.

జూన్‌ 21 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది. నిన్న 36,51,983 మంది టీకా వేయించుకున్నారు. నిన్న డోసుల పంపిణీ కాస్త తగ్గినట్లు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. మొత్తంగా 33.28 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మరో విదేశీ టీకా మోడెర్నాకు డీసీజీఐ అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌లో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా కానుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని