Corona: మరోసారి 50వేలకు చేరువగా కేసులు

తాజా వార్తలు

Updated : 01/07/2021 14:23 IST

Corona: మరోసారి 50వేలకు చేరువగా కేసులు

మరో 1,005 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40వేల దిగువకు పడిపోయిన కేసులు..వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

తాజాగా 19,21,450 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 48,786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే 6 శాతం పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు మరణాల సంఖ్య 817గా ఉంది. ఇప్పటి వరకు 3,04,11,634 మంది కరోనా సోకగా.. 3,99,459 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం 5,23,257 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.77 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 61,588 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.94 కోట్ల మార్కును దాటాయి. మరోపక్క నిన్న 27,60,345 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 33,57,16,019 కి చేరింది.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని