Corona: 5 లక్షల దిగువకు క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 03/07/2021 11:54 IST

Corona: 5 లక్షల దిగువకు క్రియాశీల కేసులు

కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. 24 గంటల వ్యవధిలో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఏప్రిల్ 8నాటి కనిష్ఠానికి చేరింది. ఇప్పటివరకు 4,01,050 మంది మహమ్మారికి బలయ్యారు.

నిన్న ఒక్కరోజే 57,477 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. క్రియాశీల కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం రికవరీలు 2.96 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల రేటు 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 43,99,298 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 34,46,11,291 కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని