Corona: 3 నెలల కనిష్ఠానికి మరణాలు

తాజా వార్తలు

Updated : 06/07/2021 12:05 IST

Corona: 3 నెలల కనిష్ఠానికి మరణాలు

వరుసగా 54వ రోజు కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. కొత్త కేసులు మార్చి 17 నాటి కనిష్ఠానికి చేరగా.. మరణాల్లో మూడునెలల క్రితంనాటి తగ్గుదల కనిపించడం ఊరటనిస్తోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

సోమవారం 16,47,424 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 34,703 మందికి పాజిటివ్‌గా తేలింది. గడిచిన 24 గంటల్లో 553 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.06కోట్లకు చేరగా.. 4,03,281 మంది మహమ్మారికి బలయ్యారు.

గత 54 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. నిన్న ఒక్కరోజే 51,864 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.97కోట్లకు చేరగా.. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,64,357 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.52శాతానికి పడిపోయింది. మరోపక్క నిన్న 45,82,246 మంది టీకాలు వేయించుకున్నారు. నిన్నటివరకు 35,75,53,612 డోసులు పంపిణీ అయ్యాయి.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని