Corona: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

తాజా వార్తలు

Updated : 08/07/2021 11:58 IST

Corona: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

55 రోజుల తర్వాత తొలిసారి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గినట్టే తగ్గి కేసులు, మరణాలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 45,892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చితే 5 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,07,09,557కి చేరాయి. నిన్న 817 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,05,028 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 18,93,800 మంది నమూనాలు సేకరించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కరోనా రెండోదశలో గత 55 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. కానీ, తాజాగా 44 వేల మంది కోలుకోగా.. 45 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం రికవరీలు 2.98 కోట్ల మార్కును దాటాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.50శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. 4.6లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న 33,81,671 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 36.48 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని