Corona: 3 కోట్ల మంది మహమ్మారిని జయించారు

తాజా వార్తలు

Updated : 12/07/2021 09:53 IST

Corona: 3 కోట్ల మంది మహమ్మారిని జయించారు

కొత్తగా 37 వేల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,32,343 పరీక్షలు నిర్వహించగా.. 37,154 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు రోజు కంటే 10 శాతం మేర కేసులు తగ్గాయి. నిన్న 39,649 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. గతేడాది జనవరి 30న దేశంలో మొదటి వైరస్‌ కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి నిన్నటివరకు 3.08 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. కోలుకున్నవారి సంఖ్య 3 కోట్ల మార్కును దాటింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కేసులు, రికవరీల మధ్య అంతరం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని.. ప్రజలంతా కొవిడ్ నియమావళిని తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆంక్షల సడలింపులతో పర్యాటక ప్రదేశాల్లో భారీ జన సమూహాలు దర్శనమివ్వడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 724 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తం మరణాలు 4,08,764కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 4,50,899 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.46 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.22 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు 37,73,52,501కి చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని