India Corona: 400కు దిగొచ్చిన మరణాలు

తాజా వార్తలు

Updated : 26/07/2021 10:16 IST

India Corona: 400కు దిగొచ్చిన మరణాలు

4.11లక్షల క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 39 వేల కేసులు వెలుగుచూశాయి. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 39,361 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక మరణాల సంఖ్య దాదాపు 400కు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 4,20,967కి చేరింది. మార్చి 30న 354 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత మృతుల సంఖ్యలో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి.

ఇక నిన్న 35,968 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరగా.. 3.05కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. అక్కడ 17,466 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో 6,843 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న దేశవ్యాప్తంగా 18.99లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన టీకా డోసులు 43.51,96,001గా ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని