Corona: 30 వేల దిగువకు కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 27/07/2021 12:28 IST

Corona: 30 వేల దిగువకు కొత్త కేసులు

132 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

4లక్షల దిగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 30వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. దాదాపు 132 రోజుల తర్వాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగివచ్చిందని పేర్కొంది. 

⇒ తాజాగా 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. 

⇒ నిన్న మరో 415 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 4,21,382 మంది మహమ్మారికి బలయ్యారు. 

⇒  ఇక నిన్న 42,363 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంమీద 3.06కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. 

 క్రియాశీల కేసులు 4లక్షల దిగువకు క్షీణించాయి. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది.

⇒  తాజాగా 66,03,112 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో టీకా డోసుల పంపిణీ 44 కోట్ల మార్కును దాటింది.   



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని