India corona: 43వేల కేసులు..41వేల రికవరీలు

తాజా వార్తలు

Updated : 28/07/2021 11:40 IST

India corona: 43వేల కేసులు..41వేల రికవరీలు

మరోసారి పెరిగిన మరణాలు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మంగళవారం 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 47 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 3.14 కోట్ల కేసులు వెలుగుచూడగా.. 4,22,022 మంది మహమ్మారికి బలయ్యారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఇక నిన్న 41,678 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోసారి రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీలు 3.06 కోట్లకు చేరగా.. రికవరీరేటు 97.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 3,99,439 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 1.27 శాతంగా ఉంది. మరోవైపు నిన్న 40,02,358 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 44,61,56,659కి చేరింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని